01-04-2025 04:47:05 PM
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్ (విజయక్రాంతి): యువత సన్మార్గంలో నడిచి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీర హనుమాన్ యాత్రలో ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... భారతదేశం భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని భిన్నత్వంలో ఏకత్వం కలదని పేర్కొన్నారు.
ధర్మాన్ని కాపాడుకుంటూ మంచి మార్గం వైపు నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఎదనిండా దేశభక్తి, దైవభక్తి, కలిగి ఉండి సన్మార్గం ఎంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధోనికేని దయానంద్, పట్టణాధ్యక్షులు నిమ్మల రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూషణ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజుర సత్యం, అంకం రాజేందర్, కావలి సంతోష్, బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు అంకం మహేందర్, పడాల రాజశేఖర్, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మంత్ర రాజ్యం సురేందర్ తదితరులు ఉన్నారు.