calender_icon.png 13 January, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత వివేకానంద మార్గంలో నడవాలి

13-01-2025 02:02:15 AM

*  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 

జగిత్యాల, జనవరి 12 (విజయ క్రాంతి): స్వామి వివేకానంద జాతికి చూపిన మార్గం లోనే యువత పయనించాలని ప్రభుత్వ వి ప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా యువజన క్రీడ ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద స్టేడి యంలో ఆదివారం నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి, జిల్లా జాయింట్ కలెక్టర్ లత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, స్వామి వివేకానంద పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జా తీయ యువజన దినోత్సవం సందర్భంగా రాష్ర్ట స్థాయిలో నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు ప్రశంసా పత్రా లు, మెమొంటో అందజేశారు. ఈ సంద ర్భంగా అడ్లూరి మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో నిర్వహించిన జాతీయ యువజన దినో త్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

స్వామి వివేకానంద సమాజం పై అత్యంత ప్రభావం చూపిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త అన్నారు. భారత దేశాన్ని ప్రేమించి, దేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యా న్ని పొందాలని ఆశించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు.

ఎక్కడైనా మాట్లాడేట ప్పుడు జనాల్ని ‘సోదరీ సోదరమణులారా’ అని సంబోధించే అమత వాక్యాలను ప్రపం చానికి పరిచయం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అన్నారు. ప్రపంచానికి ఒక గురువు స్థానంలో భారత దేశాన్ని నిలిపేలా నేటి యువత సన్మార్గంలో నడవా లని, స్వామి వివేకానంద చూపిన బాటలో పయనించాలని అడ్లూరి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి’లక్ష్మణ్, యువజన క్రీడల అధికారి రవికుమార్, టీజీవో అధ్యక్షుడు కందుకూరి రవిబాబు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.