calender_icon.png 13 January, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత దురలవాట్లకు దూరంగా ఉండాలి

13-01-2025 04:56:19 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణ యూత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2025 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర లక్కీ డీప్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇల్లెందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి బహుమతి స్కూటీని గెలిచిన విజేతకు స్కూటీని అందజేసి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్  మాట్లాడుతూ.. నేటి యువత దుర అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, సంక్రాంతి లాంటి పండుగలకు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని యువత గంజాయి, మద్యం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

యువత వ్యాయామ క్రీడల పట్ల శ్రద్ధ వహించాలని ఆ ప్రయత్నంలోనే మనకు ఉన్నటువంటి ఫారెస్ట్ ప్లే గ్రౌండ్ను తిరిగి మళ్లీ క్రీడా మైదానంగా మార్చుటకు తన వంతు కృషిచేసి ఆ యొక్క గ్రౌండ్ అభివృద్ధికి పాటుపడతానని పేద క్రీడాకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం దసరా వేడుకల కొరకు ఫారెస్ట్ ప్లే గ్రౌండ్ తిరిగి సాధిస్తానని  హామీ ఇచ్చారు. ముందు ముందు నిరుద్యోగ యువత ఉపాధి కొరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.