calender_icon.png 6 March, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి

06-03-2025 12:01:54 AM

గ్రీన్ ఫార్మాసిటీ సిఐ లిక్కీ కృష్ణంరాజు 

యాచారం మార్చి 5  : గ్రీన్ ఫార్మసిటీ  పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కెర్త మేడిపల్లి గ్రామంలో పోలీసులు ఆన్లైన్ గేమ్స్, పేకాట, చెడు వ్యసనాల, గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణంరాజు మాట్లాడుతూ. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల యువత సూసైడ్ చేసుకుంటున్నారని అలాంటి గేములకు ఎవరు అలవాటు పడవద్దు అని డ్రగ్స్ ఇతర మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.

గ్రామంలోని వ్యక్తులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్యలు వచ్చినా పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని తెలిపారు. యువతను చెడుదారి పట్టిస్తున్నాయని సైబర్ నేర్ల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మసీ పోలీస్ స్టేషన్  ఎస్‌ఐ తేజంరెడ్డి,  పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామస్తులు  పాల్గొన్నారు.