calender_icon.png 2 February, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత మత్తు అలవాట్లకు దూరంగా ఉండాలి

01-02-2025 12:00:00 AM

జిల్లా అదనపు  కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి నారాయణ

గద్వాల, జనవరి 31 ( విజయక్రాంతి ) : యువత మ త్తు పదార్థాలకు బానిసలు కాకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా అదనపు  కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి నారాయణ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని తమ ఛాంబర్ లో మాదక ద్రవ్యాల  నిర్మూలన నార్కో టెక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు లోనవ్వకుండా దూరంగా ఉండాలని ఆదిశగా అనుబంధ శాఖల అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. గంజాయి సాగు చేస్తే శిక్షకు గుర వుతారని రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

డ్రగ్స్ అమ్మే వారి గు రించి పౌరులు తమ బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్.డి. ఓ శ్రీనివాస రావు, డీ.డబ్ల్యు.ఓ సునంద, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, ఇంటర్మీడియట్ అధికారి హదయ రాజు, వైద్య శాఖ అధికారి సంధ్య కిరణ్, సి.ఐ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.