calender_icon.png 3 April, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

02-04-2025 08:17:37 PM

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్..

కామారెడ్డి (విజయక్రాంతి): యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.విజయ్ కుమార్ కోరారు. బుధవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటి బ్యూరో పోస్టర్ లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ... యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం, నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అన్నారు.

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ  నార్కోటిక్స్ బ్యూరో (టీ-ఎన్ఏబి) ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. విశ్వప్రసాద్, ఐక్యుఏసి కోఆర్డినేటర్ అంకం జయప్రకాష్, ఎన్సిసి అధికారి లెఫ్ట్నెంట్ డాక్టర్ ఏ. సుధాకర్, వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్.దినకర్ చిన్న,పిడి డాక్టర్ జి. శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.