calender_icon.png 21 March, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

20-03-2025 08:57:34 PM

నాగుపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్..

32 ద్విచక్రవాహానాలు స్వాదీనం..

అశ్వారావుపేట (విజయక్రాంతి): యువత గంజాయి వంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని దమ్మపేట ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి సూచించారు. దమ్మపేట మండల పరిదిలోని నాగుపల్లి గ్రామంలో ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎస్ఐ మాట్లాడుతూ... యువత చదువపై దృష్టి సారించి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించి స్థిరపడాలన్నారు. యువత మత్తుపదార్థాలకు బానిసలు కావటంతో వారి కుటుంబాలకు ఎంతో నష్టం జరుతుందని ఎవరి ప్రలోబాలకు గురి కావద్దన్నారు. ఆశయమే ధ్యేయంగా యువత ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో ఎవరైన అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్డన్ సెర్చ్ లో ఎటువంటి పత్రాలు లేని 32 ద్విచక్రవాహనాలను గ్రామస్థుల నుండి స్వాదీనం చేసుకొని దమ్మపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.