26-03-2025 05:53:41 PM
బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): యువత చెడు అలవాట్లయినా గంజాయి, మద్యం, డ్రగ్స్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, వాటికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలొద్దిన్ కోరారు. బుధవారం ఉదయం బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెంబర్ 2 ఇంగ్లాండ్ బస్తీలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు పని చేస్తున్నారని తెలిపారు. కాలనీలో కొత్త వ్యక్తులు గాని, నేరస్తులు గాని ఆశ్రయం పొందినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని సూచించారు.
కాలనీలో ఇలాంటి సమస్యలు ఉన్న పోలీసులు దృష్టికి తీసుకురావాలని, 100 నెంబర్ కు కాల్ చేసి తమ సమస్యలను చెప్పుకోవాలని కోరారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్, వాట్సప్ కాల్స్ కు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారి పైన అయినా కేసులు తప్పవని హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు. కాలనీలో మరింత స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని తెలిపారు.
భద్రతాపరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఎవరైనా నిషేధించిన గంజాయిని విక్రయించిన, రవాణా చేసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అంతకుముందు కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలను, 3 ఆటోలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై కె. మహేందర్, తాళ్ల గురిజాల, నెన్నెల ఎస్సైలు చుంచు రమేష్, ప్రసాద్ లతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.