calender_icon.png 23 March, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

22-03-2025 02:17:45 AM

బాన్సువాడ మార్చి 21 (విజయ్ క్రాంతి):కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎల్ డిగ్రీ కళాశాల నందు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సద స్సును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాన్సువాడ  ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు అయినా గంజాయి ,కొకైన్, హెరా యిన్, ఆల్కహాల్,సిగరెట్ వంటివి యువతరం బంగారు భవిష్యత్తును నాశనం చేసి చివరకు ప్రాణాలు హరించే స్థాయికి తీసుకువస్తాయి కావున అలాంటి చెడు అలవాట్లకు పోకుండా యువతరం ఉన్నత లక్ష్యాల వైపు అడుగు వేయాలని అన్నారు .

మన బాన్సువాడ చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరైనా మాదకద్రవ్యాలు కానీ గంజాయి సేవించిన వాళ్ళు ఉంటే మాకు సంప్రదించి వారికి రిహబిలేషన్ సెంటర్లకు కౌన్సిలింగ్ ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ వై కే ఎస్ వాలంటీర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని యువతరం మన భారత దేశంలో మాత్రమే ఉంది అలాంటి యువతరం సరైన మార్గంలో నడిచి నప్పుడే దేశ అభివృద్ధి ఖండాలు దాటుతుంది కానీ నేటి యువతరం క్షణిక సంతోషం కోసం మాదొక ద్రవ్యాలకు అలవాటై తమ లక్ష్యాలను మరిచిపోయి మత్తులో తూగుతూ దేశ అభివృద్ధిని తుంగలో తొక్కుతూ ప్రభుత్వాలకు సవాళ్లుగా మారుతుంది.

ప్రభుత్వాలు ఎన్ని నివారణ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిన అడ్డదారిన అక్రమార్కులు యువతను మత్తుల్లో ముంచుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకై ఎంతో కృషి చేస్తుంది యువతరం ఇకనైనా మారి తమ బంగారు భవిష్యత్తును ఉన్నత లక్ష్యాల వైపుకు వేసేలా కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం నిర్వహిం చింది అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుభాష్ గౌడ్, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ సునీల్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.