calender_icon.png 6 March, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి

05-03-2025 09:19:57 PM

ఇబ్రహీంపట్నం ఏసిపి కేపీవి రాజు..

యువత చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు..

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఏసిపి కేపీవి రాజు అన్నారు. బుధవారం మంచాల మండల పరిధిలోని నోముల గ్రామంలో ఆన్ లైన్ గేమ్స్, డ్రగ్స్, పేకాట ఇతర వ్యసనాల గురించి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఇబ్రహీంపట్నం ఏసిపి రాజు పాల్గొని మాట్లాడుతూ.. చెడు వ్యసనాల వల్ల యువత తప్పుదోవ పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు.

దురలవాట్లకు దూరంగా ఉండాలని యువతను ఉద్దేశించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్ లైన్ గేమ్స్, లోన్ ఆప్స్ వల్ల ఆర్థిక సమస్యల్లో పడి చాలామంది యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని, అదేవిధంగా డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్యలు వచ్చినా పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మంచాల ఏఎస్ఐ సతీష్, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.