calender_icon.png 13 January, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత క్రీడల్లో ప్రతిభ చూపాలి

12-01-2025 06:43:14 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో ప్రతిభ చూపాలని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుంగల మల్లేష్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి మండలంలోని బట్వాన్పల్లి గ్రామంలో ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ పోటీలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో యువత స్ఫూర్తిని చాటాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మండల పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ నాయకులు సింగతి కిరణ్ కుమార్, దుర్గం శ్రావణ్, బండిపెల్లి శ్యామ్, బొలిశెట్టి సుధాకర్, ముత్తె నవీన్, ఇడిగిరాల రాజశేఖర్, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.