calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఫిట్నెస్‌పై శ్రద్ధ వహించాలి

14-04-2025 12:11:04 AM

జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్13 (విజయ క్రాంతి): యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలని జాతీయ ఓబీసీ చైర్మన్ హన్స్ రాజ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాండ్రే విశాల్ ఏర్పాటుచేసిన జిమ్ ను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు తో కలిసి ప్రారంభిం చారు.

అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపం లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రూప్ నార్ రమేష్, యువజన సంఘం డివిజన్ అధ్యక్షుడు బొట్టుపల్లి ప్రశాంత్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి , మాలి సంఘం రాష్ట్ర నాయకుడు శంకర్, తరుణ్, బిజెపి లీగల్ అడ్వైజర్ బోనగిరి సతీష్ బాబు పాల్గొన్నారు.