17-04-2025 01:43:54 AM
డ్రగ్స్ నిర్ములించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
సూర్యాపేట, ఏప్రిల్16(విజయక్రాంతి) :జిల్లా యువతకి చాలా భవిష్యత్ ఉందని మత్తు ముందుకు బానిస అవ్వొద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు నార్కోటిక్ కో ఆర్డినేషన్ సెంటర్ (యన్ సి ఓ ఆర్ డి -ఎన్ కార్డు )పై జిల్లా ఎస్పి నరసింహ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యాసంస్థలు ఎక్కువ ఉన్న సూర్యాపేట,కోదాడ లో యువత కి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అనుమానం ఉన్న ప్రదేశాలలో సి సి కెమెరా లు, లైట్స్, పెట్రోలింగ్ జరపాలని తెలిపారు.