calender_icon.png 26 January, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత మత్తుకు బానిస కావొద్దు

25-01-2025 12:00:00 AM

తెలంగాణ యాంటి నార్కోటిక్స్  బ్యూరో ఎస్పీ సాయి చైతన్య 

చేవెళ్ల , జనవరి 24 : యువత మత్తుకు బానిస కావొద్దని, జీవిత లక్ష్యం వైపు ప్రయణించాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య అన్నారు. శుక్రవారం శంకర్ పల్లి మండ పరిధి దొంతాన్ పల్లిలోని ఐబీఎస్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచించారు.

మాదక ద్రవ్యాల రహిత సమాజ నిరాణంలో ప్రతి ఒక్కరే భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూళనలకు సంబంధించిన వీడియో ప్రజెంటేషన్తో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐబీఎస్ రిజిస్ట్రార్ డా.ఎస్. విజయలక్ష్మి, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎస్.పి. విశ్వనాథ్, జాయింట్ రిజిస్ట్రార్ మధుసూదన్ రావు, ఐబీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ హరీశ్ చంద్రారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.