calender_icon.png 20 April, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత స్వశక్తితో ముందుకు సాగాలి

17-04-2025 01:40:06 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 16: యువత స్వశక్తితో ముందుకు సాగాలని డీసీసీ ఉపాధ్యక్షుడు,హైకోర్టు న్యాయవాది దరూరి యోగానందచార్యులు అన్నారు.బుధవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన మేడబోయిన శంకర్-మౌనిక దంపతుల టిఫిన్ సెంటర్ ఏర్పాటుకు రూ.20వేలు ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో పోటీ తత్వాన్ని ఎదుర్కోవాలంటే యువత స్వశక్తితో ముందుకెళ్లాలని కోరారు.అనంతరం గ్రామంలో జరుగుతున్న గంగ దేవమ్మ పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష,ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,నర్సింగ శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష,ఉపాధ్యక్షులు మోరపాక సత్యం,పెసర సతీష్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వేములకొండ ఉప్పలయ్య,నాయకులు బీరెల్లి శ్రీధర్ రెడ్డి,రత్నం సంతోష్,కర్కాని సైదులు,కందుకూరి మహేష్,మద్ది లింగరాజు,ఉజిత్,జ్యోతుల వెంకన్న,మధు,బౌరోజు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.