బెల్లంపల్లి (విజయక్రాంతి): యువత వివేకానందుని స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలని సరస్వతి శిశు మందిర్ పాఠశాలల విభాగ్ అకాడమిక్ ఇంచార్జి పూదరి సత్యనారాయణ అన్నారు. ఆదివారం బెల్లంపల్లిలోని శ్రీ సరస్వతి శిశు మందిరం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పూర్వ విద్యార్థి పరిషత్ ప్రబంధకారిని ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అకాడమిక్ ఇన్చార్జి పూదరి సత్యనారాయణ మాట్లాడుతూ.. వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా యువత పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి పరిషత్ విభాగ కార్యదర్శి బాల సంతోష్, ఉపాధ్యక్షులు రాజులాల్ యాదవ్, పాఠశాల కార్యదర్శి కోడిప్యాక విద్యాసాగర్, రంగా మహేష్, మురళి, కొడితాల బాల ప్రసాద్, చిలువేరు శ్రీధర్, కాసనగొట్టు శశిధర్, పాఠశాల అకాడమిక్ ఇన్చార్జి తుతుర్ల సాయికుమార్ లు పాల్గొన్నారు.