24-03-2025 01:07:25 AM
సూర్యాపేట, మార్చి 23: సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, దోపిడి, అన్యాయాలపై భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు అమరత్వపు స్ఫూర్తితో యువత ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ అన్నారు. ఆదివారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌ల 94వ వర్ధంతి సందర్భం గా ఆ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్‌పై డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్ లను నిషేధించాలని నినదిస్తూ 2కెరన్ నిర్వహించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.... క్షమాభిక్షకు అవకాశం ఉన్నప్పటికీ బ్రిటిష్ పాలకుల దయ దక్షిణ్యాలతో ఉండే ప్రాణం నాకు అవసరం లేదని, తన ప్రాణ త్యాగంతోనైన సంపూర్ణ స్వాతంత్య్రం రావాలని ఉద్యమాలు ఉదృ తం అవ్వాలన్నారని గుర్తు చేశారు. దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయ్యని అమరుల జీవితాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు పాల్గొన్నారు.