calender_icon.png 23 February, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత అసమానతలపై ఉద్యమించాలి

22-02-2025 11:10:19 PM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

హైదరాబాద్,(విజయక్రాంతి): దేశంలో అసమానతలు లేని సమ సమాజ స్థాపన కోసం కొనసాగుతున్న పోరాటంలో యువత కీలక పాత్ర పోషించాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. పాలకులు ప్రజలను విభజించి పాలించే విధానాలను, మత పరమైన రాజకీయాలను యువత ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో యువ కార్యకర్తలకు రెండ్రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను శనివారం జాన్ వెస్లీ ప్రారంభించారు. దేశం కోసం 23 ఏళ్ల ప్రాయంలోనే ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో అధాని, అంబానీ తది తర కార్పొరేట్ శక్తుల ఆస్తులు భారీగా పెరిగాయన్నారు. దేశంలో శత కోటీశ్వరుల జాబితా 200 కు చేరిందన్నారు.

ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి వాగ్దానం నీటి మూటలు అయ్యిందన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేయడం వలన వెనుకబడిన, సామాజిక తరగతుల ప్రజలకు విద్య, ఉపాధి రంగాలలో రిజర్వేషన్లు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం. వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశం ఐక్యంగా ఉండాలంటే లౌకికవాధమే సరైన మార్గం అని అన్నారు. రాజ్యాంగాన్ని, లౌకిక వా దాన్ని రక్షించడానికి యువత కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సభ్యులు అశోక్ రెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిం చగా, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. శ్రీనివాస్, ఎం శ్రీనివాసరావు, ఎం. మహేందర్, నగర కమిటీ సభ్యులు జె.కుమారస్వామి, జి.నరేష్, ఎన్. మారన్న, జి.కిరణ్, జావెద్ తదితరులు పాల్గొన్నారు.