- వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఏడు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు
- మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): యువత ఇతరులపై ఆధారపడకుం డా స్వయం కృషితో ఎదగాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృత్రిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి అన్నారు.
మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అధ్యక్షతన యువతకు స్వయం సమృద్ధి లక్ష్య సాధన కోసం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో వారు మాట్లాడుతూ.. నాగర్‌కర్నూ ల్ పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎలా బలపడాలి, ఎలాంటి పరిశ్రమ లు ఏర్పాటు చేయాలి వంటి అంశాలపై వివరించారు.
పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చే యువతకు బ్యాంకులు రుణాలను అందిం చి, సహకరించాలని సూచించారు. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భవిష్యత్తులో ఏడు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల యువత కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు.
అధికారులు అంచనాలను మించి రావడంతో ఫంక్షన్ హాల్ పూర్తిగా నిండి పోయింది. తాగునీరు, భోజన వసతుల కల్పనలో అధికారులు వైఫల్యం చెందా రని పలువురు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా ఖుత్వాల్, కలెక్టర్లు బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బ్యాంకర్లు పాల్గొన్నారు.