calender_icon.png 18 April, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ మార్గంలో యువత నడవాలి

04-04-2025 01:22:46 AM

 మహబూబాబాద్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): శివాజీ మార్గంలో యువత నడవాలని సామాజిక అధ్యయన వేదిక  రాష్ట్ర అధ్యక్షులు రామయ్య అన్నారు.  గురువారం గూడూరు మండల కేంద్రంలో సామాజిక  అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ 345వ వర్ధంతిని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పార్నంది రామయ్య హాజరై మాట్లాడుతూ శివాజీ మార్గంలో యువత సబ్బండ వర్గాలు అందరూ పయనించాల్సిన అవసరం ఇప్పుడు ఉందన్నారు శివాజీ విద్య వీరుడు విద్య తంతాలలో మాత్రమే కాకుండా పాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రధాన్యుడు మంత్రి మండలి విధానం విదేశం విదేశాంగ విధానం పటిష్టమైన గూడాచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యాయామం చేయక ప్రజా సంక్షేమ కోసమే పాటుపడ్డారు అన్నారు. ఈ కార్యక్రమంలో పద్యాలు వేదిక జిల్లా ఉపాధ్యక్షులు మోకాళ్ళ వెంకన్న ఎమ్మార్పీఎస్ మండల నాయకులు వీరస్వామి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.