calender_icon.png 18 April, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాల కోసం యువత పోరాడాలి

11-04-2025 03:03:59 PM

మునగాల, సూర్యాపేట: యువత మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాల కోసం పోరాడాలని బిసి విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి  పచ్చిపాల రామకృష్ణ యాదవ్(Pachipala Ramakrishna Yadav) పిలుపునిచ్చారు శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా మండల కేంద్రములో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి  పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ విద్య ద్వారానే పేద వర్గాల అభ్యున్నతి సాధ్యమని భావించిన మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు ఆ దిశగా విద్యాలయాలు స్థాపించి సమాజంలో మార్పు కోసం పోరాటం చేశారని చేశారని వారు త్యాగాలు మరువలేవని వారి పోరాటాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల కోసం పోరాడాలని ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండు మీద జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ యువ నాయకుడు సిరికొండ అజయ్ మాట్లాడుతూ నేటి యువత మహనీయుల త్యాగాలను గుర్తుంచుకొని సామాజిక న్యాయం కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో  పల్లె గోపి రాంబాబు దయార్నప్ప మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.