calender_icon.png 25 March, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

యువత క్రీడల్లో రాణించాలి..

23-03-2025 09:08:28 PM

బోడు ఎస్ఐ..

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మొక్కంపాడు యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంపిఎల్ మండల స్థాయి క్రికెట్ పోటీలను బోడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. శ్రీకాంత్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని అన్నారు. గ్రామాలలో క్రీడల పోటీలు నిర్వహించడం వల్ల యువతలో ఐక్యతతో పాటు నైపుణ్యత పెరుగుతుందని, సహజంగానే, క్రీడలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానికి మంచివని అన్నారు.

తక్కువ సమయంలో టోర్నమెంట్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపిఎల్ నిర్వహకులు, యువతను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టీచర్ బానోత్ రవి మొక్కంపాడు పంచాయతీ గ్రామ పెద్దలు.. బానోత్ వాలునాయక్, మాలోత్ రాందాస్ నాయక్, దొర పటేల్ బీజ్జ, రామయ్య, ఈసం అంజయ్య, రామరావు, రాజబాబు, యువకులు సిహెచ్.చంద్రశేఖర్, బి.సురేష్, ఎం.నరేష్, బి.రవీందర్, ఆర్కే దొర, ప్రకాశ్, బి. సుభాష్, అబ్బాస్, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.