07-03-2025 12:39:36 AM
దేవరకొండ, మార్చి 6: యువత క్రీడల్లో రాణించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. చింతపల్లి మండల కేంద్రంలో ఈ నెల 10న ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న డివిజన్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కరపత్రాలను దేవరకొండలో గురువారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు టోర్నీని నిర్వహిస్తున్న ప్రెస్‌క్లబ్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, సంజీవరెడ్డి, యాదిగౌడ్, అంగిరేకుల గోవర్ధన్, హరిలాల్ నాయక్, సదానందం, గుణమోని కొండల్ యాదవ్, చిక్కొండ సాయిరాం, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అలీ, గౌరవాధ్యక్షుడు బాబన్న పాల్గొన్నారు.