ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్/మంచిర్యాల, అక్టోబర్ 7 (విజయక్రాంతి): యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజరిషా పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్‌కు చేరుకున్న సీఎం కప్ టార్చ రన్‌కు ఇందిరా ప్రియదరిని స్టేడియంలో ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి సాగతం పలికారు. అనంతరం స్టేడియం నుంచి ఆదిలాబాద్ పురవీధుల్లో క్రీడాజ్యోతి ర్యాలీ నిర్వహించారు.
మ్రంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో సీఎం కప్ టార్చ రన్‌కు కలెక్టర్ కుమార్ దీపక్ స్వాగతం పలికారు. పట్టణంలో నిర్వహించిన ర్యాలీల్లో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, 13వ బెటాలియన్ కమాండెంట్ వెంకట రాములు, డీఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.