06-02-2025 12:00:00 AM
దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
చేగుంట, ఫిబ్రవరి 5: యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన చేగుంటలోని ఓ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వెహికిల్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల వైపే కాకుండా ప్రైవేట్ రంగ సంస్థలు, స్వయం ఉపాధి రంగాలను ఎన్నుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ముజామిల్, యూత్ అధ్యక్షులు మెహన్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్, బాస రాజు పాల్గొన్నారు.