19-04-2025 01:51:26 AM
ఉచిత ఉపాధి శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): రాయికల్ పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించారు. ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, హోమ్ ఎయిడ్ హెల్త్, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత ఉపాధి శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న కోర్సుల్లో వృత్తి నైపుణ్యాలు నేర్చుకుంటూ యువత సేవా భావాన్ని అలవర్చుకుంటే ప్రగతి పతంలో దూసుకెళ్లి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడతారని అన్నారు.శిక్షణ కేంద్రంలో నీటి సమస్యను గురించి సిబ్బంది తెలపగా వెంటనే బోరువెల్ ను మంజూరు చేశారు. ప్రధాన ద్వారం వరకు సిసి రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు, ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి, నాయకులు కోల శ్రీనివాస్, డాక్టర్ మహేందర్ బాబు, మాజీ సర్పంచ్ డాక్టర్ రాజారెడ్డి, జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేందర్, చిరంజీవి, వనిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.