క్యాలెండర్‌ను ఆవిష్కరించిన చంచల్‌గూడ జైల్ సూపరిండెంటెంట్ శివకుమార్
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): అవినీతి రహిత సమాజం కోసం యువతకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చంచల్‌గూడ జైలు సూపరిండెంటెంట్ శివకుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం తన కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సమాజంలో జరిగే అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆ బాధ్యత యాక్ సంస్థ తీసుకోవాలని సూచించారు. ప్రశ్నించే విధానంతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు.