నడిగూడెం (విజయక్రాంతి): డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థలకు యువత అలవాటు పడి తమ జీవితాలను బలి చేసుకోవద్దని మత్తు పదార్థాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలనీ నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ సూచించారు. మండల పరిధిలోని కర్విరాల మోడల్ స్కూల్ లో బుధవారం డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులందరూ డ్రగ్స్, గంజాయి తదితర ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల గురించి తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలని కోరారు.
చదువుకున్న విద్యార్థులు అందరూ తాము డ్రగ్స్ కు దూరంగా ఉండటమే కాకుండా సమాజంలోని తమ కుటుంబంలోని మిగతా వారందరిని, స్నేహితులను కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రతి కళాశాలలో, హై స్కూల్ లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రగ్స్ గురించి సమాచారం తెలిసిన వారు డయల్ 100 కు కాల్ చేయాలని, సైబర్ క్రైమ్ ఫిర్యాదులకూ 1930కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్ శేఖర్, నాగేశ్వర్ రావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.