19-02-2025 07:34:20 PM
వడ్ల నవీన్ కుమార్...
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని మక్కారాజ్ పేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వై జంక్షన్ ఫ్యామిలీ దాబా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ... యువత నేటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగసంస్థలు, స్వయం ఉపాధి రంగాలను ఎన్నుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ మొజామిల్, యూత్ అధ్యక్షులు మెహన్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, కాషాబోయిన మహేష్, కొండి శ్రీనివాస్, ఢాబా హోనార్ గోగులోత్ రవి తదితరులు పాల్గొన్నారు.