దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి...
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ అర్ ఇకో ఎలక్ట్రికల్ వెహికల్ షో రూమ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ... యువత నేటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు, స్వయం ఉపాధి రంగాలను ఎన్నుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయి పేట్ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ మొజామిల్, యూత్ అధ్యక్షులు మెహన్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్, బాస రాజు తదితరులు పాల్గొన్నారు.