calender_icon.png 18 January, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటాలకు యువత ముందుండాలి

17-01-2025 07:34:45 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు యువత ముందుండాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Laxmi) అన్నారు. శుక్రవారం తన నివాసంలో అఖిలభారత యువజన సమైక్య నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోవలక్ష్మి మాట్లాడుతూ... విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారమే ఏజెండాగా ముందుకు వెళ్లాలని సూచించారు. నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉద్యమాలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి నాయకులు మహేష్, మల్లికార్జున్, భాస్కర్, సాయికుమార్, రాకేష్, హశ్విక తదితరులు పాల్గొన్నారు.