25-04-2025 06:46:49 PM
ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటో రామచంద్రు నాయక్(MLA Jatoth Ram Chander Naik) పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, యువజన సంఘం, వాసవి సేవాదళ్ నూతన కమిటీ పదవి స్వీకార కార్యక్రమం మరిపెడ పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తాము సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించాలని పిలుపునిచ్చారు.
తద్వారా పేద ధనిక భేదం లేకుండా అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. నూతన కమిటీ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘటితంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వంగేటి అశోక్, ఉపాధ్యక్షుడు పొద్దుటూరి గౌరీ శంకర్, హాకా మాజీ చైర్మన్ మచ్చ శ్రీనివాసరావు, ఆర్యవైశ్య మహాసభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తల్లాడ వెంకట రామారావు, ప్రధాన కార్యదర్శి వేమ్శెట్టి కిషోర్ కుమార్, కోశాధికారి సామా రామ్మూర్తి, ఆర్గరైజింగ్ సెక్రటరీ కూరెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.