13-02-2025 12:00:00 AM
నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి
నల్లగొండ, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిం చాలని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి అన్నారు. మిషన్ పరివర్తన్- యువతేజం కార్యక్రమంలో భాగంగా నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో సబ్ డివిజనల్ స్థాయి కబడ్డీ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసిక వికాసానికి దోహదం చేస్తాయన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహాజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఆయన వెంట నల్లగొండ వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజు, ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ కరుణాకర్, ఎస్‌ఐలు నాగరాజు, శంకర్, సందీప్ రెడ్డి, ఎస్‌ఐ విష్ణు, పీఈటీలు, పీడీలు గిరిబాబు, బాలరాజు, సత్యనారాయణ, శంభు ప్రసాద్ పాల్గొన్నారు.