వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం(Wardhannapet mandal) ఇల్లందలో శనివారం 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. లిశెట్టి రాజు కుమార్ అనే బాధితుడు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్(Online Gambling) వల్ల ఆర్థిక ఒత్తిళ్లతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా రూ.30 లక్షల అప్పులు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.