స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ లోకాయుక్త పార్క్(Saidabad Lokayukta Park) వద్ద ఓ యువకుడు కిడ్నాప్ అయ్యాడు. స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడిని దుండగులు అపహరించారు. యువకుడి స్నేహితులకు ఫోన్ చేసిన దుండగులు డబ్బు డిమాండ్ చేశారు. కిడ్నాప్ కు గురైన యువకుడి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటెజ్ ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.