11-04-2025 12:16:53 AM
కూసుమంచి ,ఏప్రిల్ 10 :యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకానికి మంచి ఆదరణ లభిస్తుంది... గత నెల 15 నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది .
ఏప్రిల్ 5 వరకు గడువు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14 వరకు గడువు పెంచి దరఖాస్తులు కోరుతోంది.. అయితే ఇప్పటివరకు కూసుమంచి మండల వ్యాప్తంగా ఉన్న 41 గ్రామ పంచాయితీల నుండి 1969 దరఖాస్తులు వచ్చినట్లు కూసుమంచి ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న దరఖాస్తుదారులు అప్లికేషన్ చేసిన దరఖాస్తు ఫాంతో పాటు దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుందని తెలిపారు.