మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన సునర్కర్ మల్లేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా బాధిత కుటుంబానికి పట్టణానికి చెందిన యూత్ ఫర్ సొసైటీ సభ్యులు సోమవారం ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు రాయబారపు కిరణ్ మాట్లాడారు. ఏడునెలల క్రితం పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ ముందు జరిగిన ప్రమాదంలో బాధితుడు మల్లేష్ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో బాధితుని వెన్నుపూస పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. అసలే పేదరికం అందులో ప్రమాదం జరగడం వల్ల నడవలేని కూర్చోలేని పరిస్థితి ఏర్పడిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. మంచానికే పరిమితమైన బాధితుని కుటుంబ సభ్యులు సహాయం కోసం తమ సంస్థని సంప్రదించడంతో రూ.5,000 అవసరమైన మెడిసిన్ లు అందించడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి బాధితుని వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సొసైటీ సభ్యులు ప్రదీప్, మహేందర్, రవికిరణ్, శశిధర్, రాజేష్, సురేందర్, చోటు, సూరజ్, అన్వేష్, ఉదయ్, ఆశ్రాఫ్, సాత్విక్, అజయ్, చింటూ, బన్నీ, అకిం, సోహెల్, సంతోష్ లు పాల్గొన్నారు.