10-03-2025 06:02:01 PM
నిత్యవసర సరుకులు పంపిణీ...
మందమర్రి (విజయక్రాంతి): నిరుపేద కుటుంబానికి మేమున్నామంటూ ముందుకు వచ్చి వారికి అండగా నిలిచి నిత్యవసర సరుకులు అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు పట్టణంలోని యూత్ ఫర్ సొసైటీ టీం సభ్యులు. పట్టణంలోని దీపక్ నగర్ కి చెందిన వడ్లూరి శంకర్ కుటుంబానికి యూత్ ఫర్ సొసైటీ టీం సభ్యులు సోమవారం నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ... శంకర్-విజయ లక్ష్మి దంపతులకు కూతురు, కొడుకు సంతానం కాగా కూతురు మరుగుజ్జు తనంతో వికలాంగురాలు అవడం, కుటుంబ పెద్ద శంకర్ కు ఈ మధ్య కాలంలో బిపి పెరిగి చిన్న మెదడుకు సర్జరీ కాగా, కుడి కాలు, కుడిచెయ్యి పక్షవాతం రావడంతో నడవలేని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
శంకర్ తల్లి వృద్ధురాలు మంచానికే పరిమితం కాగా కుటుంబ పోషణ భారం శంకర్ భార్య విజయలక్ష్మిపై పడటంతో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుందని వారన్నారు. కుటుంబం ఇబ్బందులను స్థానికుల ద్వారా తెలుసుకున్న యూత్ ఫర్ సొసైటీ సంస్థ సభ్యులు బాధిత కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసరాలు అందించారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కుటుంబానికి సహాయం చేయాలని సంస్థ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాయబారపు కిరణ్, సురేందర్, ఓజ్జ గణేష్, చోటు, మహేష్, అన్వేష్, చింటూ, కిరణ్, బన్నీ, శరత్ కుమార్, షారుక్ లు పాల్గొన్నారు.