- నిజామాబాద్ జిల్లా మోపాల్లో ఘటన
- మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు
కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): సరదాగా స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు చెరువు ఊబిలో కూరుకపోయి దుర్మరణం చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచి ప్పలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మోపాల్ ఎస్సై యాదగిరి గౌడ్ కథనం ప్రకారం..
హైదారాబాద్లోని చంద్రాయణ్గుట్టకు చెందిన కొంతమంది ఆదివారం ఉదయం మంచిప్పలోని దర్గా వద్దకు వచ్చారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం చంచల్గూడకు చెందిన సయ్యద్ వసీం(32), చంద్రాయణ్గుట్టకు చెందిన సయ్యద్ యాకుబ్ పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు.
చెరువులో దిగిన ఇద్దరూ స్నానం చేస్తూ గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ప్రత్యేక టీంతో గాలింపు చర్యలు చేపట్టి సయ్యద్ యాకుబ్, వసీం మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.