calender_icon.png 27 December, 2024 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

26-12-2024 03:02:36 AM

  • దొంగతనాలు చేస్తున్నాడని కొట్టి చంపినట్లు అనుమానం
  • శవాన్ని పూడ్చిపెట్టిన బంధువులు? సహకరించిన గ్రామస్థులు!

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): అనుమానాస్పద స్థితి యువకుడు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన జావుల నర్సింహ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం కాగా చిన్న కుమారుడు జావుల మల్లయ్య(30) వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. తాగుడుకు బానిసగా మారి గ్రామంలోని లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, బైక్‌లతోపాటు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతుండేవాడని తెలిసింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో గ్రామంలో వరుస చోరీలకు పాల్పడ్డట్టు తెలిసింది. సోమవారం గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడి రూ.50 వేలు చోరీ చేయగా ఆ ఇంటివారు మల్లయ్య కుటుంబ సభ్యులతో గొడవపడినట్లు తెలుస్తోంది. దీంతో తన అన్న, వదినలపై మల్లయ్య దాడి చేయడంతో వారు పక్కనే ఉన్న దేశిటిక్యాల గ్రామానికి వెళ్లారు.

ఆ మరుసటిరోజు మల్లయ్య శవమై కనిపించాడు. పోస్టుమార్టం నిర్వహించకుండానే గ్రామస్థుల సహకారంతో కుటుంబ సభ్యులు తమ పంటపొలంలోనే పూడ్చిపెట్టారు. అయితే తరచూ చోరీలకు పాల్పడుతున్నాడనే కోపంతోనే కొట్టి చంపినట్లు కొందరు అనుమానిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.