calender_icon.png 3 April, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

20-03-2025 01:49:58 AM

మరొకరికి తీవ్ర అస్వస్థత

నల్లగొండ, మార్చి 19 (విజయక్రాంతి) :  విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. వెంకటాద్రిపాలెం ఆవాసం జంకుతండాకు చెందిన చింతపల్లి పవన్ కళ్యాణ్ (19), పూజ దుర్గ (22) వెంకటాద్రిపాలెంలోని ప్రైవేటు గోదాములో పనిచేస్తున్నారు.

మధ్యాహ్నం క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లడానికి ఇద్ద రూ గోదాము కాంపౌండ్ వాల్ ఎక్కి కింద కు దూకేందుకు పక్కనే ఉన్న చెట్టు కొమ్మను పట్టుకున్నారు. చెట్టు కొమ్మకు 33కేవీ విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై పవన్ అక్కడికక్కడే మృతి చెం దాడు.

దుర్గకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం నల్లగొండ ఏరియా దవాఖానకు తరలించారు.  మృతుడి బంధువు చింతపల్లి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్ తెలిపారు.