calender_icon.png 27 December, 2024 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి

01-12-2024 01:28:33 AM

కామారెడ్డి, నవంబర్ 30 (విజయక్రాంతి): విద్యుత్ హై టెన్షన్ వైర్లకు తగిలి యువకుడు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి శివారులో శనివారం ఉదయం జరిగింది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి గోసంగి కాలనీకి చెందిన రాజు(28) విద్యుత్ హై టెన్షన్ వైర్ల కింద నుంచి వెళ్తూ వైర్లకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. ఘటన స్థలానికి విద్యుత్ శాఖ అధికారులు చేరుకుని పంచానామా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.