హైదరాబాద్,(విజయక్రాంతి): హుస్సేన్ సాగర్ లో జరిగిన పడవ ప్రమాదంలో గణపతి అనే యువకుడు మృతి చెందాడు. 80 శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స నిమితం చేరిన గణపతి మంగళవారం చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గణపతిగా గుర్తించారు. మరోపక్క పడవలో బాణసంచా పేలిన ఘటనలో బీటెక్ విద్యార్థి అజయ్ అనే యువకుడి గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండ్రోజుగా గాలించారు. ఇప్పటికి ఆచూకీ దొరకలేదు.