calender_icon.png 9 January, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణం

26-12-2024 02:47:30 AM

భైంసా, డిసెంబర్ 25: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. భైంసా ఏపీనగర్‌కు చెందిన అమోల్(25) బుధవారం ఇంటి నుంచి బైక్‌పై పట్టణంలోకి అతివేగంగా నడుపుతూ వెళ్లాడు. నిర్మల్ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో శుభకార్యానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రమాదం గురించి విచారించారు. మృతుడికి భార్య, కుమారుడు(5) ఉన్నారు.