14-03-2025 10:45:03 PM
ప్రాణహిత నదిలో మునిగి యువకుడి మృతి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): హోలీ పండుగ వేమనపల్లి మండలంలో శుక్రవారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా రంగులు చల్లుకుంటూ,సెల్పీలు తీసుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్న అయిదుగురు యువకులు కంపెల నవీన్, గుమ్మెల సాయి కృష్ణ, బక్కిరాకేష్, చింతల అభిరామ్, కంపెల రాజ్ కుమార్ కలిసి స్నానం చేసేందుకు వెళ్లి ప్రాణహిత నది పేట రేవు సమీపంలో స్నానానికి వెళ్లారు.ఐదుగురు యువకుల్లో కాంపెల రాజ్ కుమార్(20) నీటిలో మునిగి ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు.దీంతో యువకులు గ్రామస్థులకు స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు.సంఘటన స్థలానికి ఎస్సై శ్యామ్ పటేల్ చేరుకొని గజ ఈతగాళ్లతో గాలించగా కంపెల రాజకుమార్ మృత దేహం లభ్యమైంది.మృతుడి తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోగా తల్లి లక్ష్మి ఒక్కతే కష్టపడి చదివిస్తుంది.కాలేజీ నుండి హోలికి ఇంటికి వచ్చి ఇలా అనూహ్యంగా మృతి చెందడం తో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది .కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్యామ్ పటేల్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.