22-03-2025 12:00:00 AM
తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి
ముషీరాబాద్, మార్చి 21: (విజయక్రాంతి): అగ్రవర్ణ పేదలకు కూడా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వర్తింప చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కవాడిగూడలోని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహకు గురై పెడత్రోవ పడుతుందని, ఇటువంటి పరిస్థితులలో ఉద్యోగ అవకాశాలు లభించని నిరుద్యోగ యువతకు ఈ పథకం ఒక శాశ్వత ఉపాధికి పునాది లాంటిదన్నారు.
రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతీ యువకులకు రాజీవ్ యువ వికాస పథకం అమలు చేయడం మంచిదే కానీ, రాష్ట్రంలో అగ్రవర్ణాలుగా ఉన్న రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, క్షత్రియ, కావు, బలిజ, ఒంటరి, ముస్లిం తదితర కులాలలో 90 శాతం నిరుపేద యువతి, యువకులు ఉన్నారని, వీరంతా దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు.
అగ్రకులాలకు సంబం ధించిన నిరుపేద యువతీ యువకులకు రాజీవ్ యువ వికాస పథకం వర్తింపజేయకపోవడం బాధాకరమన్నారు. అనేక ఇబ్బం దులకు గురవుతు న్న ఓసి ల్లోని నిరుద్యోగ యువతి, యువకులకు రాజీవ్ యువ వికాస పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు పులిగారి గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.