calender_icon.png 30 April, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి

29-04-2025 10:48:29 PM

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్...

నాగోల్ లో యూత్ కాంగ్రెస్ సమావేశం..

ఎల్బీనగర్: పార్టీకి యువతే బలమని, యూత్ కాంగ్రెస్ ను బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Former MP Madhu Yashki Goud) పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను అంతమొందించడంలో యువజన కాంగ్రెస్ ఎంతో కీలకంగా పని చేసిందని, కష్టపడిన నాయకులను గుర్తించి పార్టీ తప్పకుండా ప్రోత్సహిస్తుందన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం మంగళవారం నాగోల్ డివిజన్ రాక్ హిల్స్ కాలనీలోని ఎస్వీఎల్ ఎరీనా కన్వెన్షన్ లో జరిగింది. ఈ సందర్భంగా మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే యూత్ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాలన్నారు.

దేశంలో బిజెపిని, ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కొనేందుకు యువజన కాంగ్రెస్ కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ శక్తి యువజన కాంగ్రెస్ కే ఉందనేది నేను బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేసినప్పుడే... కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఉంటుందన్నారు. యువజన కాంగ్రెస్ లో చురుగ్గా పనిచేసే వారిని గుర్తించి వారిని నాయకులుగా ప్రోత్సహించే బాధ్యత తమదని పేర్కొన్నారు. భవిష్యత్తు అంతా యువజన కాంగ్రెస్ నాయకులదే అని.. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో యువజన కాంగ్రెస్ తమదైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ఇన్ చార్జి కృష్ణ అల్లవాను, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.