17-03-2025 07:52:26 PM
జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం ప్రత్యక్షంగా సమావేశాలను వీక్షించారు. చట్టాలు, శాసనాలు రూపొందించే దేవాలయం లాంటి అసెంబ్లీలో నేడు కీలక చర్చలు జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు యువజన కాంగ్రెస్ నాయకులకు శాసన సభ వ్యవస్థ పట్ల, సభ సాంప్రదాయాలు, విలువలు పట్ల అవగాహన కల్పించడానికి, వారిలో స్ఫూర్తి నింపేందుకు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు మంచి నాయకులను అందించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవ చూపుతూ, తమకు ఈ అవకాశం కల్పించినందుకు యువజన కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, అసెంబ్లీ నాయకులు పాల్గొన్నారు.