calender_icon.png 26 October, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

09-08-2024 08:06:44 PM

ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి

కరీంనగర్: యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... యూత్ కాంగ్రెస్ 1968లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఆవిర్భవించిందని కాంగ్రెస్ పార్టీకి యువత వెన్నెముకగా యూత్ కాంగ్రెస్ ద్వారా ఎల్లప్పుడూ ఉంటారన్నారు.

నాకు కూడా యూత్ కాంగ్రెస్ ద్వారానే గుర్తింపు వచ్చిందని యూత్ కాంగ్రెస్ లో దశాబ్ద కాలం పాటు వివిధ హోదాలలో పని చేశానని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర కాంగ్రెస్ ఆవరణలో చెట్టు నాటారు. ఈ కార్యక్రమంలో కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సందీప్, జీడి రమేష్, కీర్తి కుమార్, మీరాజ్, షేహెన్షా, అష్రఫ్,మాసుం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.