09-04-2025 06:05:43 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామం పరిధిలోని పాతర్లగడ్డ గ్రామంలో టేకులపల్లి మండలం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంగనవాడి కేంద్రానికి బుధవారం సిలింగ్ ఫ్యాన్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిలువేరు చంద్రశేఖర్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భూక్యా వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారపు రవి కుమార్, కుంజా సాంబయ్య, సూరె వీరాస్వామి, మేకల స్వామి, పూజారి సంపత్, చింత కళ్యాణ్, శ్రీను, రఘు, అంగన్ వాడి టీచర్ బండ రమణ, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.